క్లైమాక్స్ ట్విస్ట్ మాములుగా ఉండదు -  Nani V Movie Climax Scene - V Telugu Movie Latest Update - V The Movie
Nani - V Movie Poster

వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం  మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వి’ మూవీ లో  నటిస్తున్న సంగతి అందరికి  తెలిసిందే. ఐతే  తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ లో సినిమా కథ మొత్తాన్నీ మలుపు తిప్పే  ఒక  అద్భుతమైన ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుందని.. ఈ ట్విస్ట్ మూవీ మొత్తానికి  హైలైట్ గా నిలుస్తోదని ఫిల్మ్ నగర్లో బాగా టాక్  వినిపిస్తోంది. ఈ ట్విస్ట్ నాని పాత్రకి సంబంధించి ఉంటుందట . ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అలాగే సాంగ్  లో నాని  విలనిజమ్ అలాగే డైలాగ్ తో  బాగా ఆకట్టుకున్నాడు.ఐతే సినిమాలో అసలు విల్లన్ నాని కాదు సుధీర్ బాబు అని మరి కొందరి భావన.కోన్ని కారణాల వాళ్ళ నాని విల్లన్ గా అంటే నెగిటివ్ గా మారతాడని టాక్.అదే చివరిగా రివీల్ అవుతుందా ! లేక మరేదైనా ఉంటుందా అని మనం సినిమాలోనే చూడాలి.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి  నాని తో గతంలో రెండు సినిమాలు చేసి హిట్ కొట్టాడు. అలాగే  సుధీర్‌బాబుతో `స‌మ్మోహ‌నం` వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తీశారు.ఇక ఈ  సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది.అని ఫాన్స్ చెప్తున్నారు .ఈ సినిమాకి  నిర్మాతగా  దిల్‌రాజు , శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి. ఈ సినిమా ఈ నెల  25న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Post a Comment

Previous Post Next Post