Nandamuri Kalyan Ram New Movie First Look - Kalyan Ram New Movie Update

నందమూరి హీరో ఏంటి ఇలా అయ్యాడు - Kalyan Ram New Movie First Look - Kalyan Ram New Movie Update - Nandamuri Kalyan Ram,Jr NTR
Nandamuri Kalyan Ram

క్రింద  ఫొటోలో కనిపిస్తున్నా హీరో ఎవరా అని చూస్తున్నారా ఎవరో కాదు మన నందమూరి హీరో  కళ్యాణ్ రామ్. ఏంటి ఇలా అయిపోయాడు అని ఆశ్చర్యపోతున్నారు కదా. కొత్త సినిమా కోసం ఈయన పడుతున్న కష్టాలివి.

Hero Kalyanram new look, he will start different concept movie. pic.twitter.com/ut8SHJKjy3
— Remo (@vedlaanjaneyulu) March 10, 2020

ఈ సంక్రాంతి కి వచ్చిన  ఎంత మంచివాడవురా సినిమా ప్లాఫ్  అయిన సంగతి తెలిసిందే. సతీష్ వేగేశ్న శతమానం భవతి లాంటి  మంచి సినిమా ఇస్తాడనుకుంటే.. మరోసారి అదే రొటీన్ సినిమా ఇచ్చాడు. దాంతో మరో ఫ్లాప్ తప్పలేదు కళ్యాణ్ రాంకీ . ఇప్పటి వరకు ఈయన తర్వాత సినిమా ఏంటనేది ఆఫీసియల్ గా బయటకు రాలేదు.

కళ్యాణ్ రామ్  మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో ఓ పీరియాడికల్ సినిమా చేయబోతున్నాడు. దీనికి రావణ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారని  తెలుస్తుంది. ఈ సినిమా కోసమే ఇప్పుడు బాడీ బిల్డప్ చేయడంతో పాటు లుక్ కూడా మార్చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.

తాజాగా బయటికి వచ్చిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 13వ శతాబ్దపు కథతో ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాలో భారీగా సిజీ వర్క్ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఓ  జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు బయటికి వచ్చిన ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. గుబురు గడ్డం.. జుట్టు.. మీసాలతో కళ్యాణ్ రామ్ చాలా కొత్తగా కనిపించాడు.

కొత్త సినిమా కోసమే కళ్యాణ్ రామ్ లుక్ ఇలా మారిపోయాడంటూ అందరిలో ఊహాగానాలు  వినిపిస్తున్నాయి. ఈ సినిమాను తన సొంత బ్యానర్‌ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ పై  నిర్మించబోతున్నాడని సమాచారం.

Post a Comment

Previous Post Next Post