Ali Bhatt Is Not Out Of RRR Movie - RRR Movie Update - Jr NTR - Ram Charan - Rajamouli

నేను ఆర్.ఆర్.ఆర్ నుంచి తప్పుకోలేదు - RRR Movie New Update - RRR Movie Latest News - Jr NTR,Ram Charan,Rajamouli
Alia Bhatt - RRR Movie


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.

ఆర్ ఆర్ ఆర్ మూవీ లో బాలీవుడ్  క్రేజీ బ్యూటీ ఆలియా భట్ రామ్  చరణ్ సరసన నటిస్తోన్న తెలిసిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నుంచి అలియా భట్ తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పుణెలో ఓ  షెడ్యూల్‌ లో ఆలియా పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆమె పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ఆర్ఆర్అర్ షూటింగ్ డేట్స్ మారడం వల్ల పుణె షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఆలియా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆలియా ఈ సినిమా నుండి తప్పుకోలేదు. పుణె షెడ్యూల్‌ ను జూన్ నెలలో షూట్ చేయనున్నారు. ఆ షెడ్యూల్ లో ఆలియా షూట్ పాల్గొనబోతుంది.

ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో అజేయ్ దేవగన్ రోల్ వస్తోందట. ఎక్కువుగా ఎన్టీఆర్ కాంబినేషన్ లోనే ఆయన సీన్స్ ఉంటాయట. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్  హీరోయిన్ గా నటితున్నారు .అజయ్ దేవగన్ ఇటీవలే ఏ చిత్రం షూటింగ్ లో జాయిన్ ఐయ్యారు .అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది .ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు  కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో  ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.

ఇ సినిమాను 2021 జనవరి 8 న విడుదల చేయనున్నారు .

Post a Comment

Previous Post Next Post