నా  పొలం లో కూడా మొలకలు వచ్చాయి- నితిన్ 
నా  పొలం లో కూడా మొలకలు వచ్చాయి- Bheeshma Movie Official Trailer - Nithin Rashmika Mandanna
Bheeshma Movie Trailer - Nithin

దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్, రష్మిక మందాన హీరో హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం భీష్మ. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న గ్రాండ్ గా విడుదల కానుంది. ఐతే  నేడు భీష్మ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. రెండు నిమిషాలకు పైగా నిడివి  గల ఈ చిత్ర ట్రైలర్ సరికొత్తగా అలాగే ఆద్యంతం కామెడీ యాక్షన్ తో అలరించింది.

భీష్మ మూవీ లో  నితిన్ రష్మిక ల  మధ్య రొమాంటిక్ ట్రాక్ కొత్తగా అనిపించింది .రొమాన్స్ తో పాటు  సోషల్ మెస్సేజ్ కూడా ఉందని ట్రైలర్ చుస్తే  అర్థం అవుతుంది. అదే ఏంటంటే  కృత్రిమ ఎరువులు, రసాయనాలు వాడి హెబ్రీడ్ పంటలు పండించడం వలన ప్రజారోగ్యానికి జరుగుతున్నా హాని గురించి కూడా తెలిపారు . ఇక అశ్వథామ సినిమాలో  జిష్షు సేన్ గుప్త భీష్మలో అసలు  విలన్ పాత్ర చేశారు. మొత్తానికి భీష్మ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత  పెంచేదిగా ఉంది. ముఖ్యంగా నితిన్ డైలాగ్ డెలివరీ అలాగే కామెడీ రొమాన్స్ కూడా బాగా వర్కౌట్ ఐనట్లు తెలుస్తుంది .నా  పొలం లో కూడా మొలకలు వచ్చాయి అనే డైలాగ్ ఫన్నీ గ ఉంది . సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.


Post a Comment

Previous Post Next Post